అడవి ఏనుగునే పరిగెత్తించిన యువతి.. ఏం చేసిందో తెలుసా..!(Video)
అటవీ ప్రాంతాల్లోని రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అటవీ ప్రాంతాల్లోని రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో ఏ జంతువులు రోడ్లపైకి వస్తాయో తెలీదు. ఒక్కోసారి అడవి జంతువులు రోడ్డు దాటి అవతలి నుంచి ఇవతలికి వెళ్తుంటాయి. అందుకే అడవి ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వాహనాలను తక్కువ వేగంతో నడపాలని ఫారెస్ట్ అధికారులు చెబుతారు.. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు చేయకూడదు.. జంతువులు రోడ్డు దాటే వరకు ఓపికగా ఎదురుచూడాలి. ఇవన్నీ ప్రాథమిక నియమాలు. తాజాగా ఓ మహిళ అటవీ ప్రాంతంలోని రోడ్డుపై తన ద్విచక్రవాహనంపై వెళ్తోంది. అదే సమయంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
