పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్ క్యాచర్‌కు ఊహించని షాక్
వర్షాకాలం కావడంతో పాములు ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్లలోకి, జనావాసాల్లోకి చొరబడుతూ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో రెండు నాగుపాములు కలకలం సృష్టించాయి. డాక్‌యార్డ్ సమీపంలోని ఓ షాపులో రెండు నాగుపాములు చేరాయి. వాటిని గుర్తించిన షాపు యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములను పట్టుకొని సంచిలో వేశాడు. రాత్రి చాలా ఆలస్యం అయిపోయేసరికి ఉదయాన్నే అడవిలో వదిలిపెడదామని పాములను సంచిలోనే ఉంచి తన ఇంట్లో భద్రంగా ఉంచాడు స్నేక్ క్యాచర్. జూన్ 2 సోమవారం ఉదయం పాములను అడవిలో వదిలేందుకు వెళ్లిన అతనికి అక్కడ ఊహించని సీన్ కనిపించింది. సంచిలో పాములను అటవీ ప్రాంతంలో వదిలేందుకు వెళ్లిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఆ సంచిలో గుడ్లు కనిపించాయి. ఏకంగా రాత్రికి రాత్రే అందులోని పాము 12 గుడ్లను పెట్టింది. విచిత్రంగా ఆ పాములను స్నేక్ క్యాచర్ ఈ గుడ్లు మీవే అయితే ఇటు తిరగండి అనగానే ఆ పాములు రెండూ గుడ్లవైపు తిరిగి పడగ విప్పి వాటిని చూస్తూ ఉన్నాయి. అనంతరం స్నేక్ క్యాచర్ అటవీ సిబ్బందికి సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అడవీ సిబ్బందికి నాగరాజు పాములను, గుడ్లను చూపించాడు. పాము గుడ్లను అడవీ సిబ్బంది జూకి తరలించగా.. స్నేక్ క్యాచర్ పాములను సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవగానే