Viral Video: మాకు మాటలు వచ్చు.. అయినా మాది మూగభాష.. అలీపూర్ గ్రామం విశేషాలు.. వీడియో
బధిరులు ఉపయోగించే సైగల భాష ప్రత్యేకతను గుర్తిస్తూ ప్రతి యేటా సెప్టెంబర్ 23 ఇంటర్వేషనల్ సైన్ లాంగ్వేజెస్ డేగా జరుపుకుంటున్నాం. ఆ రోజూవారీ జీవితంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం..
బధిరులు ఉపయోగించే సైగల భాష ప్రత్యేకతను గుర్తిస్తూ ప్రతి యేటా సెప్టెంబర్ 23 ఇంటర్వేషనల్ సైన్ లాంగ్వేజెస్ డేగా జరుపుకుంటున్నాం. ఆ రోజూవారీ జీవితంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం.. వాళ్లకు స్వాంతన అందించడం సైగల భాషల అంతర్జాతీయ దినోత్సవ ఉద్దేశం. అయితే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లు.. ఇలాంటి సైగల భాషను ఉపయోగించాలనుకోవడం మాత్రం ప్రత్యేకమైన విషయమే. అలాంటి ఓ గ్రామం కథాకమామీషు ఇప్పుడు చూద్దాం. సైగల ద్వారా మాట్లాడుకునే భారత గ్రామం అలీపూర్!. కర్ణాటకలోని ఈ ఊరిలో ప్రస్తుతం బధిరుల సంఖ్య రెండువందలకు పైనే. అయితే ఒకప్పుడు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండేది. పదేళ్ల క్రితం ఇక్కడ డెఫ్ సొసైటీని ఏర్పాటు చేయించి.. స్థానికులకు సైగల భాషను అలవాటు చేయించారు. అలా బధిరులు కానీవాళ్లు సైతం కమ్యూనికేషన్ కోసం సైగల భాషను నేర్చుకున్నారు. గత జనాభా లెక్కల ప్రకారం.. పాతికవేలకు పైగా జనాభా ఉన్న అలీపూర్‌లో పదివేలకు పైగా సాధారణ జనం సైగల భాషను ఉపయోగిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch: ఉగ్రవాదం భస్మాసుర హస్తం-మోదీ… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్
Planes-Collide : గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. వీడియో