అట్టారి-వాఘాబంద్‌తో పెళ్లి క్యాన్సిల్.. వీడియో

Updated on: May 02, 2025 | 8:28 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్‌, భారత్‌ దేశాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది.

సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని అతను వాపోయాడు.రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌కు, అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువుల్లో చాలామంది ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసారు. దీంతో పాకిస్తాన్‌పై భారత్‌ ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసివేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయి. దీంతో సైతాన్‌సింగ్‌ ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డాడు. సైతాన్ సింగ్ కు వచ్చిన కష్టంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో

ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్‌’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు

గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..