మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

Updated on: Nov 03, 2025 | 11:50 AM

మొంత తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు, ఉపరితల చక్రవాత ఆవర్తనం దీనికి కారణం. పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది.

మొంత తుఫాను ఏపీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాలు నీటమునగడంతో పాటు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొంత తుఫాను శాంతించినప్పటికీ, దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.