Wayanad Shruti: మొన్న ఫ్యామిలీ అందరూ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!

|

Sep 16, 2024 | 9:03 AM

ఇటీవల సంభవించిన వయనాడ్ విలయంలో తల్లిదండ్రులు సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో గుండె కోత ఇది. వయనాడ్ జిల్లాలోని చురాల్‌మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల శ్రుతికి జూన్ 2న తన చిరకాల మిత్రుడైన జెన్సన్ తో నిశ్చితార్థం జరిగింది. మతాంతరమైనా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయి. ఆ తర్వాత జూన్ 30న వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం శ్రుతి జీవితాన్ని అతలాకుతలం చేసింది.

ఇటీవల సంభవించిన వయనాడ్ విలయంలో తల్లిదండ్రులు సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో గుండె కోత ఇది. వయనాడ్ జిల్లాలోని చురాల్‌మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల శ్రుతికి జూన్ 2న తన చిరకాల మిత్రుడైన జెన్సన్ తో నిశ్చితార్థం జరిగింది. మతాంతరమైనా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయి. ఆ తర్వాత జూన్ 30న వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం శ్రుతి జీవితాన్ని అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియల కారణంగా ఆమె తల్లిదండ్రులు, సోదరి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి జెన్సనే. ఆమె కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు.

మోదీ పర్యటన సమయంలోనూ వీరిద్దరూ కలిసే మాట్లాడారు. జాతీయ మీడియాలోనూ వారి గురించి వార్తలొచ్చాయి. శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులకు నివాళులు అర్పిస్తూ జీవితాంతం ఒకరికి ఒకరం తోడుంటామని బాసలు చేసుకున్నారు. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ప్రకృతి విలయంలో సర్వం కోల్పోయిన తరుణంలో జెన్సన్ రూపంలో దొరికిన అండను కూడా తాజాగా కోల్పోయింది శ్రుతి. ఈ నెల 10న శ్రుతి, జెన్సన్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు వ్యానులో వెళ్తుండగా కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వ్యాన్-ప్రైవేటు బస్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జెన్సన్‌ తీవ్రంగా గాయపడగా, మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన జెన్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఉన్న ఒకే ఒక్క అండ కోల్పోవడంతో శ్రుతి ఇప్పుడు దిక్కులేనిదై విలపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on