ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్‌

|

Jul 18, 2022 | 8:45 PM

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోతున్నారు. తమ స్కిల్ బయట ప్రపంచానికి తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాల వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోతున్నారు. తమ స్కిల్ బయట ప్రపంచానికి తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాల వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రాణు మోండల్, కచ్చా బాదం సింగర్, తెలుగు విలేజ్ సింగర్ బేబి.. నిన్న కాక మొన్న జనాలకు పరిచయమైన సింగర్ జ్యోతి సైతం సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. కేవలం సింగింగ్‌ మాత్రమే కాదు.. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నవాళ్లకు ఈ ఫ్లాట్‌పామ్స్ ఉపయోగపడ్డాయి. ఈ కోవలోకే మరో మిడిల్ ఏజ్ వ్యక్తి చేరాడు. ప్రభుదేవా స్టెప్పులను యాజిటీజ్ దించేస్తూ.. నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేశాడు. 1993లో వచ్చిన ‘ జెంటిల్‌మన్ ‘ మూవీలోని ‘చికుబుకు రైలే’ పాటకు ప్రభుదేవా వేసిన స్టెప్పులను యాజిటీజ్ దించేస్తున్నాడు. కాగా డ్యాన్స్ చేసే సమయంలో అతను లుంగీతో ఉండటం స్పెషల్ అట్రాక్షన్. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీనికి ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. చాలామంది ఈ వీడియోను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. నటుడు రచ్చ రవి, క్రికెటర్ సంజు శాంసన్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ వీడియోపై రెస్పాండ్ అయ్యారు. అతడి డ్యాన్స్ సూపర్ అంటూ ఇమోజీలతో రెస్పాన్స్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్​ షీట్​తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు

Published on: Jul 18, 2022 08:45 PM