Cobra Python Fight video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. విన్నర్‌ ఎవరో తెలియాలంటే వీడియో చూడాల్సిందే..

Updated on: Nov 22, 2021 | 8:38 AM

అనుకోకుండా ఓ ఆరడుగుల నాగు పాము కనిపిస్తే భయంతో పరుగుల తీస్తాం. అలాంటిది ఓ పెద్ద నాగుపాము.. భారీ కొండచిలువతో తలపడుతూ కనిపిస్తే.. ఎలా ఉంటుంది... వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. మరి రెండు శక్తివంతమైన ఈ పాములు


అనుకోకుండా ఓ ఆరడుగుల నాగు పాము కనిపిస్తే భయంతో పరుగుల తీస్తాం. అలాంటిది ఓ పెద్ద నాగుపాము.. భారీ కొండచిలువతో తలపడుతూ కనిపిస్తే.. ఎలా ఉంటుంది… వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. మరి రెండు శక్తివంతమైన ఈ పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూస్తారు.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో గెలుపెవరిదో కూడా వీడియో చూసాకే తెలుస్తుంది.

ఒక్క నిమిషం 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పోరాటం సింగపూర్‌లోని బులో వెట్‌ల్యాండ్ రిజర్వ్‌లో జరిగింది. ఈ వీడియోలో ఒకదానికొకటి ఎదురుపడిన కొండచిలువ, నాగుపాము తలపడ్డాయి. బులోహ్ వెట్‌ల్యాండ్ రిజర్వ్ ఉద్యోగులు దీన్ని గుర్తించారు. కొంతసమయం వరకు కొండచిలువ ఆధిపత్యం చెలాయించింది. అయితే నాగుపాము ఏమాత్రం తగ్గకుండా కొండచిలువను మింగే ప్రయత్నం చేసింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. ఎందుకంటే కొండచిలువ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని నాగుపాము మింగడం అసాధ్యం. కానీ ఇక్కడ నాగుపాము కొండచిలువ కంటే కొంచెం పెద్దగా ఉంది. అది కొండచిలువను సులభంగా అధిగమించేసింది. ఈ వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 22, 2021 08:09 AM