వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన నగల పర్సు వీడియో
ఆలయానికి వెళ్ళిన ఒక కుటుంబం దగ్గరున్న 20 లక్షలు విలువ చేసిన నగలు పర్సును కోతి కొట్టేసిందట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తీవ్రగాలిపు చర్యలు చేపట్టిన పోలీసులు సిసిటివి ఫుటేజ్ ను జల్లడి పెట్టారు. అనంతరం పర్సును గుర్తించి బాధితులకు అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని బాంకి బిహారి ఆలయానికి అలీ గార్కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వచ్చాడు. గుడిలోకి వెళ్తున్న సమయంలో దొంగలుంటారనే భయంతో అభిషేక్ భార్య తన 20 లక్షల రూపాయల విలువైన నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. వారు గుడి నుంచి తిరిగి వస్తుండగా బయట ఉన్న ఒక కోతి వారి దగ్గరున్న 20 లక్షలు విలువ చేసిన నగలు ఉన్న పర్సును లాక్కొని ఇరుకైన సందులగుండా పారిపోయింది. ఎంత వెతికినప్పటికీ లాభం లేకపోవడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ సహాయంతో తీవ్ర గాలిపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత కోతి పర్సును చెట్టు పొదల్లో పడేసి వెళ్లడంతో దాన్ని తీసుకొని అభిషేక్ కు అప్పగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.