ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్ సీన్
ఏపీలో వర్షాలు, వరదల ప్రభావం కొనసాగుతోంది. వనాల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. విశాఖలో ఈ పాముల బెడద ఎక్కువగా ఉంది. ఈమధ్యే చాలా ఇళ్లలో పాములను పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ ఇంటి ముందున్న డ్రైన్‌లో ఓ పెద్ద పాము ప్రత్యక్షమై జనాలను హడలెత్తించింది. విశాఖ తుంగ్లాం ఏరియాలో ని ఓ వీధిలో ఓ ఇంటి ముందు డ్రైన్‌లో ఏదో కదులుతున్న శబ్దాలు వినిపించాయి.
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అది గమనించి ఏమై ఉంటుందా అని దగ్గరకు వెళ్లి చూశాడు. డ్రైన్‌లో పామును చూసి భయపడ్డాడు. వెంటనే ఆ ఇంట్లోనివారిని అలర్ట్ చేశాడు. స్థానికులకు విషయం చెప్పాడు. వారంతా అక్కడికి చేరుకుని పామును చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కిరణ్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. కాలువలో నక్కిన పామును జాగ్రత్తగా బయటకు రప్పించాడు. అనంతరం దానిని బంధించి తీసుకెళ్లి అటవీప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని.. తమకు సమాచారమిస్తే వాటిని బంధించి.. సురక్షితంగా అడవిలో వదిలిపెడతామని స్నేక్ క్యాచర్ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. కాటు వేస్తే
ఆఫ్రికన్ నత్తల దండయాత్ర.. మొక్కలు, తోటల విధ్వంసం
