గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

Updated on: Dec 05, 2025 | 6:54 PM

విశాఖపట్నంలోని కైలాసగిరిపై రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఐకానిక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. 1020 అడుగుల ఎత్తున, 55 మీటర్ల పొడవున గల ఈ వంతెన సముద్ర అందాలు, ప్రకృతి దృశ్యాలను వీక్షించే సరికొత్త అనుభూతిని అందిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఒకేసారి 40 మంది పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఈ గాజు వంతెన విశాఖకు ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.

అందాల విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 55 మీటర్లు.. 500 టన్నుల భారం మోసే సామర్ధ్యం బ్రిడ్జ్‌కు ఉంది. గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలిగేలా నిర్మించారు. ఒకేసారి ఈ బ్రిడ్జిపైకి 100 మంది పర్యాటకులు ఎక్కి ప్రకృతి అందాలు వీక్షించవచ్చు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఒకసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సముద్రమట్టానికి 1020 అడుగుల ఎత్తులో వేలాడే గ్లాస్ బ్రిడ్జ్.. పర్యాటకులకు సరికొత్త థ్రిల్ ను అందిస్తోంది. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన గాజు వంతెనకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విశాఖ నగర పరిధి నుంచే కాక చుట్టూ పక్కల జిల్లాలు అయిన విజయనగరం, శ్రీకాకుళం, అన్నవరం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరారు. వంతెన చివరి ప్రాంతానికి చేరుకుని సముద్ర అందాలను వీక్షిస్తున్నారు. సెల్​ ఫోన్​లో ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు దిగుతూ సందడి సందడి చేస్తున్నారు. ఈ గ్లాస్​ బ్రిడ్జి నుంచి బీచ్​ అందాలు, ప్రకృతిని ఆస్వాదించడం సంతోషంగా ఉందంటున్నారు ప్రకృతి ప్రమికులు. బ్రిడ్జిపై నుంచి 10 నిమిషాల పాటు ప్రకృతి అందాలు వీక్షించడానికి అవకాశం కల్పించారు. ‘ఈ గాజు వంతెనపై నడుస్తుంటే చాలా కొత్తగా అనిపించిందని.. గాలి వేగానికి ఊగుతూ కనిపించిందని.. ఆకాశంలో విహరిస్తుట్లుగా ఉందని అన్నారు. బ్రిడ్జి నుంచి సముద్రపు అందాలు, మేఘాలు , కొండలు చాలా బాగా కనిపించాయని చెప్పారు. కుటుంబం అంతా మళ్లీ కలిసి వస్తాం అంటూ సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్

మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్