
Viral Video: చాలామంది రన్నింగ్‌లో ఉన్న బస్సులు, రైళ్లు ఎక్కుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. కొందరు ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలున్నాయి. అయితే ముంబైలోని రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ఒక్కసారిగా జారీ పడిపోయింది. దీంతో గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఒక్కసారిగా ట్రాక్ కిందకు పడిపోవడంతో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై కాపాడారు. పోలీసులు సైతం పరుగెత్తుకుంటూ వచ్చారు. వేగంగా వెళ్లిన రైలు ఈ ప్రమాదం జరగడంతో నిలిచిపోయింది. అయితే వీడియోను చూస్తే మాత్రం ఆమెకు తీవ్రంగానే గాయాలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గత వారం రోజుల కిందట కూడా లోక్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఓ మహిళ రైలు ఎక్కుతు ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.