Viral Video: పాము-ముంగిసల మధ్య హోరా..హోరీ..థ్రిల్లింగ్ ఫైట్ లో గెలుపు ఎవరిదో..చూడండి!

|

Apr 05, 2021 | 1:00 PM

పాముకు ముంగిస కు ఉన్న జాతి వైరం తెలిసిందే. రెండూ ఒకదానికి ఒకటి ఎదురుపడ్డాయి అంటే ఇక ఫైట్ ప్రారంభం అయినట్టే. రెండిటి మధ్య జరిగే యుద్ధం మామూలుగా ఉండదు.

Viral Video: పాము-ముంగిసల మధ్య హోరా..హోరీ..థ్రిల్లింగ్ ఫైట్ లో గెలుపు ఎవరిదో..చూడండి!
Viral Video
Follow us on

Viral Video: పాముకు ముంగిస కు ఉన్న జాతి వైరం తెలిసిందే. రెండూ ఒకదానికి ఒకటి ఎదురుపడ్డాయి అంటే ఇక ఫైట్ ప్రారంభం అయినట్టే. రెండిటి మధ్య జరిగే యుద్ధం మామూలుగా ఉండదు. తన కోరలతో కాటు వేసేయాలి చూసే పాము.. నోటితో పామును పట్టి చంపేయాలని చూసే ముంగిస.. రెండూ గెలుపు ఎవరిదో తేలేవరకూ పక్కకు జరగవు. చుట్టూ ఎంత హడావుడి ఉన్నా ఎక్కడా వెనుకడుగు వేయవు.

సరిగ్గా ఇటువంటి ఫైట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని సింద్ ఖేడ్ తాలూకా సావ్ ఖేద్ నాగ్రే రోడ్డులో ఈ యుద్ధం జరిగింది.

నడిరోడ్డు మీద జరిగిన ఈ పామూ ముంగిస కొట్లాటను చూడటానికి రోడ్డుపై వెళుతున్న ట్రాఫిక్ ఆగిపోయింది. జనం దీనిని చూడటానికి అక్కడే నిలబడిపోయారు. పెద్ద పాము.. చిన్న ముంగిస రెండిటి మధ్యా జరుగుతున్న ఫైట్.. ఇంకేముంది జనంలో ఆసక్తి పెరిగిపోయింది. కళ్ళువిప్పార్చి రెప్పలు వేయకుండా ఆ దృశ్యాన్ని చూస్తూండిపోయారు.

హోరాహోరీ..

అతి పెద్ద పాము చిన్న ముంగిసతో ఫైట్ అంటే ఏకపక్షంగా ఏమీ సాగలేదు. హోరాహోరీగా రెండూ దెబ్బలాడుకున్నాయి. పాము తన పాడగా విప్పి.. ముంగిసపై కోరలతో దాడికి దిగింది. మరో పక్క చిన్న ముంగిస కూడా ఎక్కడా తగ్గలేదు. తన నోటితో పాము పడగను కొరికే ప్రయత్నం గట్టిగా చేసింది.

ముంగిసదే గెలుపు..

పెద్ద పాము పదే పదే కాటు వేస్తుంటే ముంగిస వెనక్కి తగ్గినట్టు కనిపించింది. అయితే, కొద్ది సెకన్లలోనే తిరిగి పాముపై ఎదురుదాడికి దిగింది. ఇలా మూడు నాలుగు సార్లు జరిగింది. చివరకు ముంగిస పామును విపరీతంగా గాయపరచగలిగింది. దీంతో ఆ కోబ్రా పని అయిపొయింది. మొత్తమ్మీద పట్టు విడవకుండా ముంగిస పాముపై గెలుపు సాధించింది. దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ యుద్ధం సాగింది. ఈ ఫైట్ ను అక్కడ చేరిన వారు చాలా మంది వీడియో తీశారు.

ఆ వీడియో మీరూ చూడండి..

Also Read: Ariyana Glory : ఇక పై కనిపించను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్ వీడియో..

లవ్‌ ఫెయిల్యూర్‌ బాధను భరిచడం చాల కష్టం..తన బ్రేకప్ గురించి చెప్పిన అంజలి.. : Anjali About Breakup video.