Viral Video: ఇలాంటి కళను మీరు ఎన్నడూ చూసి ఉండరు.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారంతే.. !

|

Jul 20, 2021 | 6:46 AM

ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ వీడియోలలో కొన్ని మనల్ని నవ్విస్తే... మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు నమ్మలేకపోవచ్చు కూడా.

Viral Video: ఇలాంటి కళను మీరు ఎన్నడూ చూసి ఉండరు.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారంతే.. !
Viral Rats
Follow us on

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ వీడియోలలో కొన్ని మనల్ని నవ్విస్తే… మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు నమ్మలేకపోవచ్చు కూడా. ఇలాంటి వీడియోనే ఇప్పుడు మీ దగ్గరకి తీసుకొచ్చాం. ఈవీడియోలో ఓ వ్యక్తి ఎలుకలను ఆడించడం చూడొచ్చు. అది కూడా తను చెప్పినట్లు ఆడుతుండడం విశేషం. వీడియోలోని వ్యక్తి చేతుల హావభావాలపై ఎలుకలు ప్రవర్తించడం మనం చూడొచ్చు. కొందరు వారి ప్రత్యేకమైన కళతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారని మనకు తెలుసు. అయితే ఇలాంటి వ్యక్తి గురించి మీరు విన్నారా? ఎలుకలతో ‘డ్యాన్సులు’ చేపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

ఇక వీడియోలోని వ్యక్తి గురించి మాట్లాడితే.. నాలుగు ఎలుకలు అతని వద్ద ఉన్నాయి. వాటిని తన ఎదురుగా ఉంచుకొని, సదరు వ్యక్తి తన వేళ్లతో వాటికి ఆడిస్తున్నాడు. ఎలుకలు కూడా ఆ వ్యక్తి చెప్పినట్లు ఆడుతుండడం విశేషం. అనంతరం కొన్ని ఎలుకలను కొంత దూరం విసిరేసి, మరలా అదే ప్లేస్‌లోకి వచ్చి ఆగమన్నట్లు తన వేళ్లతో సైగ చేశాడు. అతను చెప్పినట్లే అవి కూడా నడుచుకుని ఆశ్చర్యపరిచాయి. అన్ని ఎలుకలను అలాగే చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రసుతం తెగ సందడి చేస్తోంది. నెటిజన్లకు కూడా బాగా ఆకట్టుకుంటోంది. దీనిపై చాలామంది ఫన్నీ కామెంట్స్ చేశారు. ఎలుకలను ఆడించే కళ నిజంగా ప్రత్యేకమైందంటూ కామెంట్లు రాసుకొస్తున్నారు. నీది మాములూ టాలెంట్ కాదని కొందరు.. అన్ని కళల్లో ఇది మాత్రం చాలా స్పెషల్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూసిన తరువాత, ఈ వ్యక్తి ఎలుకలను ఎలా నియంత్రించగలుగుతున్నాడనే ఆశ్చర్యం కలగమానదు. క్రేజీ జట్టు అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్టు చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల వ్యూస్‌తో ఈ వీడియో దూసుకపోతోంది.

Also Read:

TV9 దృశ్యం :నడిరోడ్డు పై భారీ త్రాచుపాముల సయ్యాట..గగుర్పొడిచే వీడియో..:Two Snakes Dance Video.

ఇదేం సాహసం రా బాబు.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో..!వైరల్ అవుతున్న వీడియో.:Man Jumping Video.

Viral Video: చూపులేని ఏనుగుకు మరో గజరాజు సాయం.. మనసులను హత్తుకునే వీడియో