Viral Video: ఓ బార్‌లో సందడి చేసిన కంగారు.. మాతో అనుకోని అతిథి అంటున్న మందుబాబులు..

|

Apr 25, 2022 | 5:17 PM

Viral Video: ఓ బార్‌లో(Bar) మందు బాబులు మందు తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ కంగారు(Kangaroo) జంతువు ఆ బార్‌లోకి ఎంటరయి అందరినీ ఆశ్చర్యపరిచింది..

Viral Video: ఓ బార్‌లో సందడి చేసిన కంగారు.. మాతో అనుకోని అతిథి అంటున్న మందుబాబులు..
Kangaroo Enters A Bar
Follow us on

Viral Video: ఓ బార్‌లో(Bar) మందు బాబులు మందు తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ కంగారు(Kangaroo) జంతువు ఆ బార్‌లోకి ఎంటరయి అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుకోని అతిధి ఆ బార్‌లోకి ఎంటరవడంతో అక్కడున్న వారంతా చాలా కంగారు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ కంగారు ఆహారం కోసం వెతుకుతూ బార్‌లోకి ఎంటరయినట్లు తెలుస్తోంది. అలా బార్‌లోకి వెళ్లిన కంగారూ అక్కడ ఎలాంటి ఆహారం దొరక్కపోవడంతో తనదారిన తను వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన యూజర్‌… ‘ఊహించ‌ని అతిథి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా వేలమంది లైక్‌ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేసారు.

ఆస్ట్రేలియాలోని ఓ బార్‌లోకి కంగారు ప్రవేశించింది. అయితే ఈ జంతువు వల్ల ప్రజలు ఇబ్బంది పడలేదు. కంగారూలు ఆస్ట్రేలియా జాతీయ జంతువు. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో కంగారూ బార్‌లోకి ప్రవేశించి దాని నుండి త్వరగా బయటపడింది. ఇన్‌స్టాగ్రామ్ “australian.animals”లో షేర్ చేయబడిన ఈ వీడియో 85,000 కంటే ఎక్కువ లైక్‌లను, మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందింది. pennywittenbaker అనే వినియోగదారుడు మొదట ఈ వీడియో షేర్ చేసినట్లు తెలుస్తోంది. కంగారూ ఆస్ట్రేలియన్ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. భారీ పెట్టుబడులతో..

Garuda Vega Producer: జీవితా రాజశేఖర్‌కు డబ్బు పిచ్చి.. గరుడ వేగా నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి