ఈ కాకి చేసిన పని ఓ అపార్ట్ మెంట్లో ఉన్న వారందరినీ అయోమయానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మ ఈ కాకి ఎంత పని చేసిందంటూ అవాక్కవుతున్నారు. ఓ అపార్ట్ మెంట్ వాసులు ప్రతిరోజు మేడపైన హ్యాంగర్లకు బట్టలు తగిలించి ఆరేసుకుంటున్నారు. సాధారణంగా బట్టలు ముడతలు పడకుండా ఉండేందుకు తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు ఆరేసుకునేందుకు ఇలా హ్యాంగర్లను ఉపయోగిస్తుంటారు. అలా బట్టలు ఆరేస్తున్న హ్యాంగర్లు కనిపించకుండా పోతున్నాయి. ప్రతిరోజు హ్యాంగర్లు మాయమవడంతో ఎవరో ఎత్తుకెళ్లి పోతున్నారేమో అని అనుమానం వచ్చిన ఆ అపార్ట్ మెంట్ లోని వాళ్లు ఓ రోజు మేడపైన కాపు కాశారు. ఎవరికీ కనిపించకుండా ఓ మూల నుంచి గమనిస్తున్న వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ కాకి మేడ మీద ఎవరూ లేరని నిర్ధారించుకొని నేరుగా అక్కడికి వచ్చి తాడుకు వేలాడుతున్న హ్యాంగర్లను నోటకరుచుకొని వెళ్ళిపోయింది.