తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్
చైనాలో వేసవి తాపం నుండి రక్షణ కోసం యువత వినూత్నంగా తామర ఆకులను వాడుతున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌లో మొదలైన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లోటస్ ఆకులు ముఖానికి చల్లదనాన్ని, సూర్యరశ్మి నుండి సహజ రక్షణను అందిస్తాయి. రసాయనాలు లేని ఈ పద్ధతి పర్యావరణ హితంగా ఉండటంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది ఫ్యాషన్‌గా, ఫన్‌గా మారి, ఖర్చులేని సురక్షిత పరిష్కారాన్ని చూపుతోంది.
వేసవి వేడి ఎంత ఎక్కువైతే మనుషుల ఐడియాలు అంత వింతగా మారతాయని చైనాలో ప్రస్తుత ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. సన్‌స్క్రీన్, క్యాప్, గాగుల్స్ ఇవేవీ కావు, చైనా యువత తమ ముఖాలపై ఏం పెట్టుకున్నారో తెలుసా? పెద్ద పెద్ద కమలాపూల ఆకులు! చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు బైక్ రైడర్లు తమ ముఖాలపై భారీ గ్రీన్ లోటస్ లీవ్స్ పెట్టుకుని తిరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన వెంటనే ప్రజలు షాక్ అయ్యారు… కానీ అదే సమయంలో నవ్వుకున్నారు . “ఇదేం కొత్త ఫ్యాషన్?” అనుకునేలోపే… ఆ ఐడియా దేశమంతా వ్యాపించింది. ఆ పద్ధతి చాలా సింపుల్. చెరువుల్లోని పెద్ద పెద్ద లోటస్ ఆకుల్ని తెంచుకుని… కళ్లకి, ముక్కుకి చిన్న హోల్స్ కట్ చేసి… హెల్మెట్ తో ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ ఆకులు ఎంత పెద్దగా ఉంటాయంటే ముఖం మొత్తం కవర్ అవుతుంది. కొందరు బైక్ మీద వెళ్లినా, మరికొందరు రోడ్డుపై నడిచినా… అందరిదీ ఇదే స్టైల్ — ముఖంపై గ్రీన్ లీఫ్! ఆ సీన్ చూడడానికి చాలా ఫన్నీగా ఉన్నా.. ఇదే అంతా ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే లోటస్ ఆకులు సూర్య కిరణాలను బ్లాక్ చేస్తాయి, చల్లగా గాలి కూడా వెళ్లేలా చేస్తాయి. సన్‌స్క్రీన్‌లో ఉండే కెమికల్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ సమస్యల్లేవు. సహజంగానే తామర ఆకులు నీటిలో పెరగడం వల్ల చల్లదనాన్ని ఇస్తాయని, సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడకుండా ఇవి రక్షణ కవచంలా పనిచేస్తాయని స్థానికులు నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో రియాక్షన్స్ మాత్రం మిక్స్‌గా వచ్చాయి. అది 100% నేచురల్ సొల్యూషన్ అని నెట్టింట ప్రశంసించారు. కొందరు “ఇది సూపర్ ఐడియా… ఎకో ఫ్రెండ్లీ!” అని మెచ్చుకోగా… ఇంకొందరు “ గిబ్లి సినిమా క్యారెక్టర్లలా ఉన్నారు!” అంటూ జోకులు పేల్చారు. మరికొందరు అయితే “టాన్ కాకుండా ఉండటానికి చైనీయులు ఏదైనా చేస్తారు!” అంటూ కామెంట్స్ చేశారు. చైనాలో స్కిన్ కేర్‌కు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. ఎండలో బయటికి వెళితే పూర్తి కవర్‌తో ఉంటారు — మాస్క్స్, గ్లోవ్స్, అంబ్రెల్లా.. ఇలా అన్నీ వాడుతారు. కానీ ఈ కమలం ఆకుల ఐడియా మాత్రం అందరికీ కొత్తగా అనిపించింది. ఇది కేవలం సన్ నుంచి ప్రొటెక్షన్ మాత్రమే కాదు… కొంచెం ఫన్ కూడా. ఎందుకంటే బైక్ మీద పెద్ద ఆకుతో తిరగడం అంటే చూసేవాళ్లకి నవ్వొస్తుంది. అదే ఈ ట్రెండ్ వైరల్ అవడానికి కారణం. సింపుల్ ఐడియా… కానీ భారీ అటెన్షన్! ఇది ఒక విషయం మాత్రం ప్రూవ్ చేసింది — పెద్ద సమస్యలకు సింపుల్ సొల్యూషన్స్ కూడా ఉండొచ్చు. అంతేకాదు… నేచర్‌తో కలిసి ఉంటే… ఖర్చు లేకుండా మనం సేఫ్‌గా ఉండొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం ఎక్కేముందు ప్రతీసారీ.. వారికి నోట్ పంపుతానన్న ఆమిర్
Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
విదేశం నుంచి వచ్చి ఓటేసిన విజయ్ ఫ్యాన్.. ఆ ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి
Top 9 ET News: ఇది గాలివాటంగా వచ్చిన విజయమా ?? విజయే నమ్మడం లేదా??