కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
ఫ్లోరిడా హైవేపై వెళ్తున్న కారును ఓ చిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ ఢీకొంది. ఇంటర్‌స్టేట్-95 వద్ద జరిగిన ఈ వింత ప్రమాదంలో పైలెట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానం నేలపైన ఎందుకు ల్యాండ్ అయిందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది.
ఎప్పుడూ బిజీగా ఉండే ఓ రోడ్డుపై ఓ యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు అన్నాక.. యాక్సిడెంట్స్ మామూలే కదా అని తీసిపారేయకండి. ఇది సాదాసీదా యాక్సిడెంట్ కాదు. రోడ్డు మీద వెళుతున్ ఓ కారును ఆకాశంలో ఎగురుతున్న ఓ విమానం వచ్చి ఢీకొట్టటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ముందే చెప్పాను కదా ఇది సాదాసీదా యాక్సిడెంట్ కాదని. యస్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయరహదారిపైన ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పింది. పైలెట్ నియంత్రణ కోల్పోవటంతో అది వేగంగా వెళ్లి.. కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ఓ ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటిపడినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఎమర్జీన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నారని, వారిద్దరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. విమానం ఎమర్జెన్సీగా నేలపై ఎందుకు ల్యాండ్ అయింది అన్న విషయంపై క్లారిటీ లేదు. కారును విమానం ఢీకొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2 Review: లాజిక్స్ లేవమ్మా.. అన్నీ గూస్ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే… 130 అడుగుల నుండి
నన్ను చంపండి ప్లీజ్.. కారుణ్య మరణం కోరుకునే చీమ!