Electric Bike: చదివింది పదోతరగతే.. సొంతంగా ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారుచేసి.. వీడియో చూసి షాక్ అవుతూ ప్రసంశలు కురిపిస్తున్న నెటిజన్లు..

|

Mar 01, 2022 | 9:58 AM

రైతుని అందరూ చాలా తక్కువగా చూస్తారు. కానీ ఆ రైతే నేడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అన్నదాతగా మానవాళికి అన్నం పెడుతూనే.. మేధావులకు తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్నాడు. ఇదిగో ఈ రైతు కేవలం పదో తరగతి మాత్రమే చదివాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.


రైతుని అందరూ చాలా తక్కువగా చూస్తారు. కానీ ఆ రైతే నేడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అన్నదాతగా మానవాళికి అన్నం పెడుతూనే.. మేధావులకు తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్నాడు. ఇదిగో ఈ రైతు కేవలం పదో తరగతి మాత్రమే చదివాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రైతు ఇప్పుడు సొంతంగా విద్యుత్తు బైకు రూపొందించాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఎక్కుకవ దూరం ప్రయాణించే బైక్‌ తయారు చేసి వావ్‌.. అనిపించాడు. లాక్‌డౌన్‌ సమయంలో రెండేళ్లు కష్టపడి అనుకున్నది సాధించాడు. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా అర్థాపుర్‌ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్‌ 14 రూపాయల ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్‌ బైక్‌ రూపొందించాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో పూలు సాగుచేసే ధ్యానేశ్వర్‌కు రోజూ పూలు మార్కెట్‌కి రవాణా చేసేందుకు 250 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈ ఖర్చు తగ్గించుకోవాలన్న ప్రయత్నంలోనే పాత పెట్రోల్‌ బైకును విద్యుత్తుతో నడిచేలా తీర్చిదిద్దాడు. 750 వోల్ట్‌ కెపాసిటీ మోటార్, 48 వోల్ట్‌ బ్యాటరీ, ఛార్జర్, కంట్రోలర్, లైటు, ఎలక్ట్రిక్‌ బ్రేక్‌ అమర్చాడు. దీనికి 4 గంటలు ఛార్జింగ్‌ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇందుకయ్యే ఖర్చు 14 రూపాయలు మాత్రమే. విద్యుత్‌ బైకు తయారీకి మొత్తం 40 వేల రూపాయలు ఖర్చు అయినట్టు ధ్యానేశ్వర్‌ చెప్పాడు. తగిన సహకారం ఉంటే మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు.

మరిన్ని చూడండి ఇక్కడ: