నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో రెండు గుర్రాలు ఒక దానిపై మరొకటి తీవ్రంగా దాడికి దిగాయి. ఈ క్రమంలో అందులో ఒక గుర్రం అటుగా ప్రయాణికులతో వెళుతున్న ఇ-రిక్షాలోకి దూకి, అందులోంచి బయటికి రాలేక.. అక్కడే ఇరుక్కుపోయింది. ఆటోలో ఇరుక్కుపోయిన గుర్రాన్ని స్థానికులు అతి కష్టం మీద బయటికి తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జులై 23న మధ్యప్రదేశ్ జబల్పూర్‌లో రద్దీగా ఉండే నాగరత్ చౌక్ వద్ద రెండు గుర్రాలు ఉన్నట్టుండి ఘర్షణకు దిగాయి. స్థానికులు వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అవి.. అక్కడే ఉన్న ఓ షోరూమ్‌లోకి దూసుకెళ్లి, విధ్వంసం సృష్టించాయి. ఆ తరువాత వాటిలో ఒక గుర్రం మళ్లీ రోడ్డుపైకి వచ్చి.. రోడ్డుపై ప్రయాణీకులతో వెళ్తున్న ఒక ఇ-రిక్షాపైకి దూకింది. దీంతో ఆ రిక్షా డ్రైవర్, ఒక ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కలవారు పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, గుర్రం ఆటోలో చిక్కుకుపోయి దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత స్థానికులు దానిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గుర్రం కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, గత రెండు మూడు రోజులుగా ఆ కూడలిలో.. ఈ రెండు గుర్రాలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయని, దీనిపై కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక షాపుల యాజమానులు వాపోయారు. స్థానికంగా కాసేపు గందరగోళానికి దారితీసిన ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో
వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో
ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్ చేసిన పనితో వీడియో