Rabbit massaging Cat: పిల్లికి మసాజ్‌ చేస్తున్న కుందేలు.. ఏం కాకా పడుతుందో..! వైరల్ అవుతున్న వీడియో..

మసాజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు ఏదో ఒక సమయంలో మసాజ్ చేయించుకుని ఉంటారు. ఇది శరీరానికి చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది. సోషల్ మీడియాలో..Rabbit Massage Cat: మసాజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.  మీరు ఏదో ఒక సమయంలో మసాజ్ చేయించుకుని ఉంటారు. ఇది శరీరానికి చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది.  సోషల్ మీడియాలో  మీరు మసాజ్‌కి సంబంధించిన అనేక రకాల వీడియోలను చూసి ఉంటారు. అనేక రకాల మసాజ్‌లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో అన్ని రకాల మసాజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. మీరు మనుష్యులు మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు చాలా చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పిల్లి మసాజ్ చేయించుకోవడం చూశారా..? అవును, ఈ రోజు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక కుందేలు పిల్లికి మసాజ్ చేయడం చూడవచ్చు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి నేలపై పడుకుని నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తుంది. హాయిగా కూర్చోని కుందేలుతో దాని వీపుపై మసాజ్ చేయించుకుంటుంది. కుందేలు కూడా వేగంగా తన పని చేస్తుంది. అది పిల్లిని ఎందుకు అంతలా కాక పడుతోందో అర్థం కాదు. కాని అతడిని చూస్తుంటే పిల్లి వీపుకి మసాజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu