శునకాలు విశ్వాసానికి మారు పేరు. ఇంటికి కాపలాగా ఉండటమే కాకుండా.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా కలిసిపోతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి కుక్కలతో ఉండే సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒక చిన్న అమ్మాయి, తన పెట్ డాగ్ తో కలిసి ఇంటి తలుపు ముందు కచేరీ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. గిటార్, మైక్రోఫోన్ తో పాటు పింక్ స్కర్ట్ వేసుకున్న చిన్నారి పాట పాడటం చూడవచ్చు. అంతే కాదండోయ్.. ఆ బాలిక పాట పాడుతున్న సమయంలో పక్కనే ఉన్న శునకం కూడా రాగం తీసింది. నీకు జతగా నేనూ పాడుతానంటూ రాగం కలిపింది. చాలా తక్కువ కాలంలోనే ఈ వీడియో22,400 లైకులు సాధించింది. ఈ కచేరీకి టిక్కెట్‌లు ఎక్కడ కొనుగోలు చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Viral News: ఇదేక్కడి రూల్ రా నాయనా!.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ రూ. 20 వేలు ఫైన్..