Variety Love Proposal: వెరైటీ లవ్ ప్రపోజల్.. ప్రేయసి కోసం సముద్రంలోకి దూకేశాడు..! చూస్తే షాకే..
తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె ముందు ఒక ప్రపోజల్ పెట్టడం, ఆమె దానిని అంగీకరించడం వారిద్దరి జీవితంలోని అత్యంత అందమైన క్షణం. ఈ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించిన..
ఇక్కడ కూడా అలాంటి వీడియో వైరల్‌గా మారింది. కానీ ఇలాంటి సంఘటన చాలా అరుదు. ఎందుకంటే.. స్కాట్ క్లెయిన్ అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి సుజీ టక్కర్‌తో బోట్‌లో వెళ్తూ.. టైటానిక్ సినిమా పోజులో ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ, అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఉంగరం అతని చేతిలోంచి జారి సముద్రంలో పడింది. వెంటనే క్లెయిన్ నీళ్లలోకి దూకేశాడు. దీంతో ప్రేయసితో పాటు అక్కడున్న మరో ఇద్దరు ఆందోళనకు గురయ్యారు. ఉంగరం బాక్స్ నీటిపై తేలియాడంతో క్షణాల్లోనే దాన్ని పట్టుకున్నాడు క్లెయిన్. నీళ్లలో నిలబడి ఉంగరం చూపించి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి ప్రేమను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
