వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు

Updated on: Mar 21, 2026 | 4:44 PM

నీలం డ్రమ్ము, సిమెంటు ప్రస్తావన కొన్నిసార్లు భర్తలకు భయం కలిగిస్తోంది. యూపీలోని బులందర్ షహర్‌కు చెందిన రాజ్ కుమార్ తన భార్య ఫేస్‌బుక్‌లో ప్రియుడితో ఉన్న ఫొటోలు, భర్తలను హత్యచేసిన కథనాలు చూసి వణికిపోయాడు. ప్రాణభయంతో మధ్యవర్తుల ద్వారా భార్యను ఆమె ప్రియుడికి అప్పగించాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య విషయంలో తీసుకున్న షాకింగ్ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్ షహర్‌కు చెందిన రాజ్ కుమార్, తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ నిర్ణయం వెనుక ఆదర్శమైన భావజాలం కాదని, ప్రాణభయం ఉందని తెలుస్తోంది. రాజ్ కుమార్ భార్య తరచుగా పుట్టింటికి వెళ్లి ప్రియుడితో తిరిగేది. ఇటీవల రాజ్ కుమార్ తన భార్య ఫోన్ తనిఖీ చేయగా, అందులో ప్రియుడితో దిగిన ఫొటోలు కనిపించాయి. అంతేకాకుండా, భార్య తన ఫేస్‌బుక్ వాల్‌పై ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేసిన పలు ఘటనలకు సంబంధించిన కథనాలను పోస్ట్ చేసినట్లు గుర్తించాడు. ఈ కథనాలు “డ్రమ్ము మర్డర్ల” గురించి, ముఖ్యంగా గత ఏడాది మీరట్‌లో జరిగిన సంఘటన గురించి వివరించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది

ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు

కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??

Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం

Loading...
Unable to load recommendations.
Follow Us