UP Girl: వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్ రైలెక్కి 140 కి.మీ. ప్రయాణించిన అమ్మాయిలు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆకతాయి కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు గూడ్స్‌రైలు ఎక్కి ఏకంగా 140 కి.మీ.లు ప్రయాణించారు ఇద్దరు అమ్మాయిలు. వారిని ట్రెయిన్ గార్డు రవినీత్ ఆర్య కాపాడారు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. హాథ్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో ఆగింది. సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లబోయిన ట్రైన్ గార్డు ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చొని భయంభయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికలను గమనించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆకతాయి కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు గూడ్స్‌రైలు ఎక్కి ఏకంగా 140 కి.మీ.లు ప్రయాణించారు ఇద్దరు అమ్మాయిలు. వారిని ట్రెయిన్ గార్డు రవినీత్ ఆర్య కాపాడారు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. హాథ్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో ఆగింది. సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లబోయిన ట్రైన్ గార్డు ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చొని భయంభయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికలను గమనించారు. వివరాలు ఆరా తీయగా.. బాలికలు కన్నీటిపర్యంతం అవుతూ జరిగిన ఉదంతాన్ని వివరించారు.
హాథ్రాస్‌కు చెందిన ఈ బాలికలు చీకటిపడ్డాక ట్యూషను నుంచి తిరిగివస్తుండగా కుర్రాళ్లు వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసి మార్గమధ్యంలోని రైల్వేస్టేషనులో ఆగి ఉన్న గూడ్సు బండెక్కి నక్కి కూర్చొన్నారు. ఇంతలో రైలు కదిలిపోయింది. అలా 140 కి.మీ.లు రైలు ప్రయాణించింది. చుట్టూ చీకటి.. చేతిలో ఉన్న సెల్‌ఫోనుతో ఇంట్లోవాళ్లకు సమాచారం ఇచ్చారు. ఎక్కడ ఉన్నారో.. ఎటు వెళుతున్నారో మాత్రం చెప్పలేకపోయారు. ఈ విషయం ఆర్య స్టేషన్ సూపరింటెండెంటు దృష్టికి తీసుకువెళ్లడంతో బాలికల కుటుంబాలతో మాట్లాడి సురక్షితంగా ఇళ్లకు పంపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.