మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..

|

Sep 15, 2022 | 8:46 PM

పోలండ్‌ దేశం ఒస్ట్రోమెక్కో ప్రాంతం పెయిన్‌ అనే గ్రామంలో వ్యాంపైర్‌ సమాధిని గుర్తించారు. నికోలస్‌ కోపర్నికస్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది.

పోలండ్‌ దేశం ఒస్ట్రోమెక్కో ప్రాంతం పెయిన్‌ అనే గ్రామంలో వ్యాంపైర్‌ సమాధిని గుర్తించారు. నికోలస్‌ కోపర్నికస్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్‌గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్‌గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమె ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

Digital TOP 9 NEWS: కీడు సోకిందంటూ చెట్ల కింద ఉంటున్న గ్రామస్తులు | పది అడుగుల పాము బుసలు కొడితే..

Digital News Round Up: రెమ్యూనిరేషన్‌లో తగ్గేదే లే! | మాజీ సీఎం పరుగులెట్టించిన ఏనుగు ..లైవ్ వీడియో

TOP 9 ET News: హీరో చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డ్‌ | నివేదా లుక్‌ పై ట్రోల్స్

 

Published on: Sep 15, 2022 08:46 PM