తాళి కట్టాలంటే చర్నాకోల దెబ్బలు తినాల్సిందే..!

Updated on: Sep 08, 2025 | 6:17 PM

పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధానికి పునాది.. రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి వారధి... అందుకే పెళ్లనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. పచ్చని పందిళ్లు, బంధుమిత్రుల సందళ్లు, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ మూడుముళ్లు, ఏడడుగులతో రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుక. ఈ వివాహ క్రతువు వారి వారి సంప్రదాయాలు ఆచారాల ప్రకారం జరుగుతాయి.

కొందరి ఆచారవ్యవహారాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొందరు వరుడికి వధువుతోపాటు భారీ కట్నకానుకలు ఇస్తారు. కానీ వైఎస్సార్‌ కడప జిల్లాలోని బూచుపల్లె వంశీయుల పెళ్లిలో మాత్రం ఈ మొత్తం తతంగంతోపాటు పెళ్లి కుమారుడికి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఆచారంగా పాటిస్తారు. అదేంటో త్వరగా తెలుసుకోవాలని ఉందా. సాధారణంగా వధూవరుల తలపై జీలకర్ర బెల్లం పెట్టి, వరుడు వధువు మెడలో తాళికట్టి, తలంబ్రాలు పోయడంతో పెళ్లి తంతు ముగుస్తుంది. కానీ బూచుపల్లె వంశీయుల పెళ్లి ఇంతటితో ముగియదు. వీటన్నిటితో పాటు వరుడిని చర్నాకోలతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారట. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన తర్వాత అతడిని కుటుంబ సభ్యులు చర్నాకోలతో మూడు దెబ్బలు వెస్తారట. ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుందట. అసలీ ఆచారం ఎలా మొదలైందంటే..వందల ఏళ్ల క్రితం బూచుపల్లె వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు చర్నకోలాలు కనిపించాయట. వెంటనే ఆ వంశీలు ఆలయంలోకి వెళ్లి గంగమ్మను తప్పు జరిగిందని, క్షమించమని వేడుకున్నారట. దీంతో గంగమ్మ ప్రత్యక్షమై.. మీ వంశీయుల వివాహ సమయాల్లో వరుడికి చర్నకోలతో మూడు దెబ్బలు కొట్టాలని చెప్పిందట. అప్పటి నుంచి ఆ ఆచారాన్ని వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలోనూ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని భద్రంపల్లె, తొండూరు, ఇనగలూరు, లోమడ, బూచుపల్లె, బోడివారిపల్లె, మల్లేల, అగడూరు, సంతకొవ్వూరు గ్రామాల పరిధిలో బూచుపల్లె వంశీయుల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊర్లలో దాదాపు వెయ్యికి పైగా ఈ వంశీయుల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పెళ్లిళ్ల సమయంలో నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షణక్షణం..భయం భయం.. చేతబడులతో వణికిపోతున్న గ్రామం

ఆ పనిమనిషి చేసిన పనికి సోషల్‌ మీడియా షేక్‌

ఇక.. ఇండియాలో ఇంద్రధనస్సు కనబడదా? వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు