Naga Human Skull: వేలంలోకి అరుదైన నాగా మానవ పుర్రె.. మండిపడ్డ ఆ ప్రాంత ప్రజలు.!

|

Oct 14, 2024 | 11:12 AM

భారత్‌కు సంబంధించి అత్యంత పురాతన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. నాగాలాండ్‌కు చెందిన అత్యంత పురాతన వస్తువులను తాజాగా బ్రిటన్‌ ఆన్ లైన్‌లో వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. నాగా ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే నాగా మానవ అవశేషాలను వేలంలో ఉంచి వారి మనోభావాలను దెబ్బతీసింది. దాంతో నాగాలాండ్‌లో నిరసనలు చెలరేగాయి.

భారత్‌కు సంబంధించి అత్యంత పురాతన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. నాగాలాండ్‌కు చెందిన అత్యంత పురాతన వస్తువులను తాజాగా బ్రిటన్‌ ఆన్ లైన్‌లో వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. నాగా ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే నాగా మానవ అవశేషాలను వేలంలో ఉంచి వారి మనోభావాలను దెబ్బతీసింది. దాంతో నాగాలాండ్‌లో నిరసనలు చెలరేగాయి. ఈ వేలాన్ని నిలిపివేయాలంటూ నాగాలాండ్‌లోని నాగా సొసైటీ.. ఫోరం ఫర్ నాగా రీకన్సిలియేషన్.. సీఎం రియోకు సూచించింది. దీంతో ఆయన.. కేంద్రమంత్రి జైశంకర్‌కి ఆగమేఘాల మీద లేఖ రాశారు

బ్రిటన్‌లో నాగ మానవ అవశేషాలను ఆన్ లైన్‌లో వేలం వేయనున్నారంటూ భారీ ప్రచారం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అలాగే నాగా మానవ అవశేషాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు ఎంత పవిత్రంగా వ్యవహరిస్తారనే అంశాన్ని సైతం కేంద్ర మంత్రికి రాసిన లేఖలో సీఎం స్పష్టం చేశారు. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం ఆన్ లైన్ లో వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. నాగా మానవ అవశేషాల వేలాన్ని వెంటనే నిలిపిపేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు నాగాలాండ్ సీఎం నీఫియు రియో విజ్జప్తి చేశారు. దీంతో కేంద్ర మంత్రి జై శంకర్ జోక్యంతో.. ఈ వేలం నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on