Digital TOP 9 NEWS: నీట్ అర్హులకు శుభవార్త | షారుఖ్‌కు తీవ్రగాయాలు

|

Jul 05, 2023 | 8:31 AM

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు..

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు అమరత్వం అజరామరమన్నారు రాష్ట్రపతి. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను రాష్ట్రపతి ముర్ము స్మరించుకున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి అన్నారు మోదీ. కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిగా పోల్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: హైదరాబాద్ రోడ్లపై నడుస్తున్నారా ?? మీ ప్రాణాలు జాగ్రత్త !!