ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగు రోడ్ల కూడలిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు ఏకంగా 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డవడంతో అవి నెట్టింట చేరి వైరల్‌గా మారాయి. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలి ఓ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16 మధ్యాహ్నం రెండు గంటలకు అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును ఆపలేదు. దాంతో సిద్ధేశ్వర్ తన బైక్‌పైన కారును వెంబడించారు. ఓ జంక్షన్ వద్దకు చేరుకోగానే బైక్ పక్కన పడేసి అతని కారును ఆపేందుకు కారుముందుకు వెళ్లి ప్రయత్నించారు. దాంతో ఆ డ్రైవర్ కారు ఆపకపోగా కానిస్టేబుల్‌ను గుద్దుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అలర్టయిన సిద్ధేశ్వర్ జంప్‌చేసి కారు ముందు భాగంలోని అద్దం పట్టుకుంటూ వేలాడుతూ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయినా డ్రైవర్ ఆగలేదు. అలాగే 20 కిలోమీటర్లు లాక్కుపోయాడు. రద్దీగా ఉన్న రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా డ్రైవర్ కారు నడుపుతూ పోయాడు. చివరకు సిద్ధేశ్వర్ గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకోగానే కింద పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తమ తమ వాహనాల్లో కారును వెంబడించారు. కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..