పబ్లిక్‌ టాయిలెట్‌లో టైమర్‌.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న జనం

|

Jun 18, 2024 | 8:25 PM

మీరు కూడా ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లే ఉంటారు. అయితే పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు ఉన్నారో చెప్పే టైమర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇలాంటి దృశ్యానికి సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్ ఇన్‌స్టాల్ చేయడం ఏంటని ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా అన్ని పరిమితులను దాటేస్తోందా అనిపిస్తోంది.

మీరు కూడా ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లే ఉంటారు. అయితే పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు ఉన్నారో చెప్పే టైమర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇలాంటి దృశ్యానికి సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్ ఇన్‌స్టాల్ చేయడం ఏంటని ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా అన్ని పరిమితులను దాటేస్తోందా అనిపిస్తోంది. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్ ఇన్‌స్టాల్ చేసింది. ఇటీవల యుంగాంగ్ బౌద్ధ గ్రోటోలో టాయిలెట్ టైమర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ ఒక పురాతన బౌద్ధ దేవాలయం. ఇక్కడ 200 కంటే ఎక్కువ గుహలు, వేలాది బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించింది. ఇక్కడ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో టైమర్‌లు అమర్చి ఉన్నాయంటూ చెప్పే పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టైమర్లతో ఒక వ్యక్తి బాత్రూమ్ లోపల ఎంతసేపు ఉన్నారనేది తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం రేగడంతో ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఒక ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం.. పర్యాటకులు బాత్రూంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని అంటున్నారు. బాత్రూమ్ లోపల వారికి ఏదైనా జరిగితే, అత్యవసర పరిస్థితి తలెత్తితే, అటువంటి పరిస్థితిలో వారిని సేవ్ చేయవచ్చు. అంటే పర్యాటకుల భద్రత కోసం ఈ టైమర్ ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. మరోవైపు కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బాత్రూమ్‌ను ఉపయోగించే సమయాన్ని టైమర్ నిర్ణయించదని మరో ఉద్యోగి చెప్పారు. బాత్రూమ్ లోపల ఎవరైనా ఎంత సమయం అయినా గడపవచ్చు. ఈ టైమర్ వల్ల బయటి వ్యక్తులు అనవసరంగా తలుపు తట్టాల్సిన అవసరం ఉండదు అంటూ కొందరు అభిప్రాయపడితే, మరికొందరు ఉద్యోగులు ఎవరైనా ఎక్కువ సమయం బాత్‌రూమ్‌లో నుండి బయటకు రాలేదంటే ఏమైందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఈ టైమర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వెనుక ఉన్న ఆవశ్యకతను ఉద్యోగులు వివరించినప్పటికీ తమ ప్రైవసీకి భంగం వాటిల్లుతోందని అక్కడికి వచ్చే పర్యాటకులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేరేడు పండ్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

బెండకాయను నానబెట్టిన నీళ్లు తాగితే షుగర్ పరార్

Follow us on