తిరుమలలో శ్రీవారి టోకెన్ల పేరుతో మోసం.. భక్తుల్ని బురిడీ కొట్టించి డబ్బు వసూళ్లు

|

Sep 26, 2021 | 9:48 AM

చిత్తూరు జిల్లా తిరుమలలో కొత్త తరహా మోసం బయటపడింది. కొందరు దళారులు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

చిత్తూరు జిల్లా తిరుమలలో కొత్త తరహా మోసం బయటపడింది. కొందరు దళారులు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులను టార్గెట్ చేసిన దళారులు తమ వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని నిండా ముంచుతున్నారు. అందుకోసం ఏకంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరుతో మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. తిరుమల వెంకన్న సాక్షిగా కేటుగాళ్ల మోసాలు బట్టబయలు చేశారు పోలీసులు..సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని చెప్పి, ఒక్కో టిక్కెట్‌కు 8వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

RTOలో ఫ్యాన్సీ నంబర్లు వేలం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ దక్కించుకున్న నెంబర్‌ ఇదీ..? వీడియో

Follow us on