Dating Leave: డేటింగ్‌ చేయడానికి జీతంతో కూడిన సెలవులు.! మా నిర్ణయమన్న సంస్థ

|

Sep 09, 2024 | 11:48 AM

ప్రస్తుతం డేటింగ్ కల్చర్ కామన్ అయిపోయింది. అయితే థాయ్‌లాండ్‌లోని ఓ సంస్థ త‌మ సిబ్బందిలో ఒకరు చాలాసార్లు డేటింగ్‌లో బిజీ అంటూ త‌ర‌చూ సెల‌వులు పెట్టడంతో కొత్త ప్రయోజనాన్ని ప్రకటించి తాజాగా నెట్టింట‌ వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లోని మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తన ఉద్యోగుల కోసం "టిండర్ లీవ్‌''ను తీసుకువ‌చ్చిన‌ట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

ప్రస్తుతం డేటింగ్ కల్చర్ కామన్ అయిపోయింది. అయితే థాయ్‌లాండ్‌లోని ఓ సంస్థ త‌మ సిబ్బందిలో ఒకరు చాలాసార్లు డేటింగ్‌లో బిజీ అంటూ త‌ర‌చూ సెల‌వులు పెట్టడంతో కొత్త ప్రయోజనాన్ని ప్రకటించి తాజాగా నెట్టింట‌ వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లోని మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తన ఉద్యోగుల కోసం “టిండర్ లీవ్‌”ను తీసుకువ‌చ్చిన‌ట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. డేట్‌లకు వెళ్లడానికి ఉద్యోగుల‌కు చెల్లింపుల‌తో కూడిన సెల‌వులు ఇస్తామ‌ని సంస్థ ప్రక‌టించింది. అయితే ఈ రోజుల్లో చాలామంది యువతి, యువకులు డేటింగ్ పార్ట్‌నర్స్‌ను కలిసేందుకు పెద్ద పార్టీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో తక్కువ ఖర్చులో చాలా సరదాగా, మనసు విప్పి మాట్లాడుకునే డేట్స్‌నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

‘టిండర్ లీవ్’ పేరిట ఇస్తున్న ఈ సెల‌వుల‌ను ఉద్యోగులు జులై నుండి డిసెంబరు వరకు ఏ స‌మ‌యంలోనైనా వాడుకోవ‌చ్చట. ఉద్యోగుల శ్రేయ‌స్సు కోస‌మే ఈ కొత్త ప్రయోజ‌నాన్ని చేకూరుస్తున్నట్లు మార్కెటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అయితే, టిండర్ లీవ్‌కు ఎన్ని రోజులు కేటాయించారనేది మాత్రం సంస్థ పేర్కొనలేదు. ఇక ఈ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా ఒక వారం ముందుగానే స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులు ఎవరితోనైనా డేటింగ్ కోసం టిండ‌ర్ సెలవును ఉపయోగించవచ్చు అని వైట్‌లైన్ గ్రూప్ లింక్డ్‌ ఇన్‌లో ఒక‌ పోస్ట్ ద్వారా తెలిపింది. మార్కెటింగ్ ఏజెన్సీ నిర్వాహకులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అక్కడి ఉద్యోగుల‌ పనిని మరింత ఆనందదాయకంగా మారుస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.