Black Magic: విశాఖ జిల్లాలో బుసలు కొట్టిన మూఢనమ్మకం..చేతబడి నేపంతో ముగ్గురు బలి..!(వీడియో)

|

Dec 13, 2021 | 9:28 AM

విశాఖ జిల్లాలో చేతబడి కలకలం రేపింది..పాత కక్షల కు అనుమానం తోడైంది..! చేతబడి అనే మూఢనమ్మకం బీజం వేసింది.. వాగ్వాదం కాస్త ప్రతీకారానికి దారితీసింది.. ఫలితంగా పచ్చటి గూడెంలో నెత్తురు చిందింది.

YouTube video player
విశాఖ జిల్లాలో చేతబడి కలకలం రేపింది..పాత కక్షల కు అనుమానం తోడైంది..! చేతబడి అనే మూఢనమ్మకం బీజం వేసింది.. వాగ్వాదం కాస్త ప్రతీకారానికి దారితీసింది.. ఫలితంగా పచ్చటి గూడెంలో నెత్తురు చిందింది. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన అనంతగిరి మండలం టోకూరు పంచాయితీ బర్మాగ్‌ వలసలో చోటు చేసుకుంది.టోకూరు పంచాయతీ బర్మాగ్‌ వలసలో ఉంటున్న గిరిజన కుటుంబాల్లో కిల్లో కోమటి, గోల్లోరి డుంబు కుటుంబాలు కూడా వేర్వేరుగా నివాసిస్తున్నాయి. ఆయా కుటుంబాలు వేర్వేరుగా తమ పిల్లా పాపలతో కలిసి జీవిస్తున్నాయి. కోమటి కోడలు వాలంటీర్. ఇటీవల ఇరుకుంటుంబాల నడుమ మనస్పర్థాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కిల్లో కోమటి కుటుంబ సభ్యులపై చేతబడి నెపంతో గొల్లోరి డుంబు వర్గం కత్తులతో దాడులు చేశారు. ఈ దాడిలో కిల్లోరి కోమటి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని కుమారులు బలరాం, భగవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

ఇక కోమటిని కోల్పోయి, బాలరామ్ తీవ్ర గాయాలు పాలవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబం.. సుబ్బారావు కుటుంబంపై తిరుగుబాటు చేసింది. గ్రామస్తుల కొంతమంది వారికి తోడయ్యారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే అతడు మృతి చెందాడు. సుబ్బారావు తండ్రి డొంబు ను కూడా తరిమికొట్టారు. తీవ్రగాయాలతో గ్రామ శివారులో కుప్పకూలిపోయి మృతిచెందాడు డుంబు. చిన్నారికి చేతబడి చేయడంతోనే ప్రశ్నించినందుకు దాడి చేశారని.. తన తండ్రి కోమటి ని హత్య చేసినందుకే.. సుబ్బారావు, డొంబు ను హతమార్చామని అంటున్నారు కోమటి కొడుకు బాలరాం. చేతబడి నెపంతో ఘర్షణలో కిల్లోరి కోమటి, సుబ్బారావు, డుంబు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు… గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.చిన్న చిన్న కక్షలు.. చిన్నారి అనారోగ్యంతో మూఢనమ్మకాలు భుసలు కొట్టాయి. వాగ్వాదం కాస్త ఘర్షణగా మారి.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరస్పర దాడులతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది ఈ ఘటన. అనుమానం.. మూఢనమ్మకం.. క్షణికావేశం వెరసి ఇంతటి దారుణానికి దారితీసింది. కంప్యూటర్ యుగంలో ఉన్న ఈ కాలంలో చేతబడి మూఢ నమ్మకం వెనుక మగ్గిపోతున్న ఈ అమాయక ఆదివాసీలకు అవగాహన కల్పించి ఆ చీకటి నుంచి బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు తీసుకొని ఆ అమాయక ఆదివాసీలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Published on: Dec 13, 2021 09:27 AM