ఏటీఎంలో చోరీ.. నగదు కాదు.. మరేంటో మీరే చూడండి !!
ఏటీఎంలలో చోరీలు జరగడం తరచూ మనం చూస్తున్నాం. ఏటీఎం బద్దలుకొట్టి క్యాష్ ఎత్తుకెళ్లడం, ఒకవేళ క్యాష్ రాకపోతే ఏకంగా ఏటీఎంలనే ఎత్తుకెళ్లిన సంఘటనలూ చూసాం. నిందితులు సీసీ కెమెరాలకు చిక్కి పోలీసులు జైల్లో వేస్తున్నా కూడా చాలాచోట్ల ఈ ఏటీఎం దొంగతనాలు ఆగడం లేదు.
ఏటీఎంలలో చోరీలు జరగడం తరచూ మనం చూస్తున్నాం. ఏటీఎం బద్దలుకొట్టి క్యాష్ ఎత్తుకెళ్లడం, ఒకవేళ క్యాష్ రాకపోతే ఏకంగా ఏటీఎంలనే ఎత్తుకెళ్లిన సంఘటనలూ చూసాం. నిందితులు సీసీ కెమెరాలకు చిక్కి పోలీసులు జైల్లో వేస్తున్నా కూడా చాలాచోట్ల ఈ ఏటీఎం దొంగతనాలు ఆగడం లేదు. తాజాగా ఏటీఎంలో మరో విచిత్రమైన చోరీ జరిగింది. ఇందులో దొంగ ఏటీఎంలోని ఏసీకి టెండరేశాడు. ఏటీఎం ఓపెన్ కాకపోతేనేం చల్ల చల్లని ఏసీ ఉందిగా అనుకున్నట్టున్నాడు. ఏకంగా ఏసీనే ఎత్తుకెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. పంజాబ్‌లోని మోగా జిల్లా బాఘ్ పట్టణంలో ఏటీఎం మిషన్‌ని, డబ్బులు వదిలేసి ఏకంగా ఏసీని ఎత్తుకెళ్లిపోయారు. జూలై 16 సాయంత్రం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలోకి వచ్చారు.