నిద్రపోతున్న డ్రైవర్..బస్సుపై కన్నేసిన దొంగ.. చివరకు వీడియో

Updated on: Jul 30, 2025 | 12:17 PM

ఇంటి బయట, బజారు, ఆఫీసుల వద్ద వాహనాలు చోరీకి గురైన సందర్భాలు తరచూ వింటూ ఉంటాం.. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, కార్లు చోరికి గురవుతుంటాయి.. లారీలు భారీ వాహనాలు చోరీ ఘటనలు అప్పుడప్పుడు వింటుంటాం.. అయితే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేసి తీసుకెళ్లిపోయాడు.. మరి కాసేపట్లో బస్సు బయలుదేరాల్సి ఉండగా బస్టాండ్‌కు చేరుకున్న డ్రైవర్ కు అక్కడ బస్సు లేకపోవడం చూసి కంగు తిన్నాడు. .

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరులో నైట్ హాల్ట్ ఉండి ఉదయం ఐదున్నరకు నెల్లూరు నుంచి ఆత్మకూరు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. రాత్రి బస్టాండ్ ప్రాంగణంలో పార్క్ చేసి వెళ్లి డ్రైవర్ నిద్రించాడు. తిరిగి వచ్చి చూడగా బస్సు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బస్సు అర్థరాత్రి మూడున్నరకు చోరీకి గురైనట్టు గుర్తించారు.. నెల్లూరు జిల్లా చౌక చర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణ కే చోరీకి పాల్పడ్డట్టు కనిపెట్టారు.నెల్లూరులో బస్సును దొంగతనం చేసి అతను డ్రైవ్ చేసుకుంటూ ఆత్మకూరు వైపు వెళుతున్నట్టు గుర్తించారు.. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద పోలీసులు బస్సును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు.. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగా లేనట్టు పోలీసులు గుర్తించారు.. గతంలో నెల్లూరు ఆర్టీసీ గ్యారేజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన కృష్ణ ను అధికారులు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో