Spider attack on bird: పక్షినే వేటాడిన సాలెపురుగు.. సాలెగూడులో హమ్మింగ్‌ బర్డ్‌.. వీడియో చూస్తే షాకే.

Updated on: Sep 30, 2022 | 10:01 AM

మన ఇళ్లలో.. లేదా చెట్టు కొమ్మలకు సాలెపురుగులు గూడు కట్టుకోవడం చూస్తుంటాం. అది వలలా గూడును అల్లుతుంది. వాటిని బూజులుగా మనం దులిపి పాడేస్తాం. కానీ సాలీడు అంత పెద్దగా వలను అల్లడం వెనక పెద్ద కథే ఉంది.


మన ఇళ్లలో.. లేదా చెట్టు కొమ్మలకు సాలెపురుగులు గూడు కట్టుకోవడం చూస్తుంటాం. అది వలలా గూడును అల్లుతుంది. వాటిని బూజులుగా మనం దులిపి పాడేస్తాం. కానీ సాలీడు అంత పెద్దగా వలను అల్లడం వెనక పెద్ద కథే ఉంది. ఆ వల దాని గూడు కాదు.. ఆహార సంపాదనలో భాగంగా అది అలా వల అల్లుతుంది. దాని ద్వారా అనేక కీటకాలను చంపి తినేస్తుంటుంది. ఈగలు, చిన్న చిన్న కీటకాలు ఆ వలలో చిక్కుకుంటాయి. వాటిని ఆహారంగా తినేస్తుంది సాలీడు. ఇటీవల ఓ సాలీడు వలలో చిక్కుకున్న పామును స్పైడర్ చంపేసిన వీడియో చూసి ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఓ పెద్ద పక్షి చిక్కుకుంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఒక హమ్మింగ్ పక్షి సాలీడు వలలో చిక్కుకుంది. అయితే ఆ పక్షి ఆ వల నుంచి బయటపడేందుకు తెగ ట్రై చేస్తుంది. కానీ ఆ వల గట్టిగా ఉండడంతో అది బయటకు రాలేకపోయింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక చిన్న సాలీడు దాని వైపు వేగంగా వస్తుంది. అయితే ఆ పక్షి ఆ వలనుంచి తప్పించుకుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 30, 2022 09:57 AM