శుభవార్త.. ఆ క్యాన్సర్‌కు ఇక ముక్కు నుంచి ఔషధం వీడియో

Updated on: Feb 10, 2025 | 12:50 AM

ప్రాణాంతక పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ చికిత్సకు అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్లోమ గ్రంధి క్యాన్సర్‌ కణతులు చిన్న పేగు వంటి కీలకమైన అవయవాలకు సమీపంలో ఏర్పడతాయి. దీంతో అధిక డోస్‌తో రేడియేషన్‌ థెరపీ చేయడం వల్ల తీవ్రమైన జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్యాన్సర్‌ కణతుల సమీపంలోని ఆరోగ్యకర కణజాలానికి నష్టం కలుగుతుంది. అయితే, ఆమైఫోస్టిన్‌ అనే ఔషధం రేడియేషన్‌ థెరపీ చేస్తున్నప్పుడు ఆరోగ్యకర కణజాలానికి రక్షణనిస్తుంది. ఇప్పటివరకు సిరల ద్వారా ఇచ్చే ఈ ఔషధం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ అధికంగా ఉంటున్నందున ఎక్కువగా వినియోగించడం లేదు. నోటి నుంచి ఈ ఔషధాన్ని ఇస్తే కడుపు