ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..

Updated on: Nov 04, 2022 | 8:46 AM

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన జలాంతర్గామిల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడటం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు..

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన జలాంతర్గామిల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడటం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు.. బ్రిటన్‌ నేవల్‌ స్టాఫ్‌ చీఫ్‌ బెన్‌ కీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రాయల్‌ నేవీలో లైంగిక వేధింపులకు చోటే లేదని, ఇటువంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. దోషులుగా తేలిన వారెవరైనా సరే ర్యాంకుతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. 2011 నుంచి బ్రిటన్‌ రాయల్ నేవీ తన సబ్‌ మెరైన్‌ సేవల్లో మహిళా సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలోనే సోఫీ బ్రూక్‌ అనే మహిళ కూడా విధుల్లో చేరారు. కొన్నేళ్లకు ఆమెకు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటూ ఆదేశాలు వచ్చాయి. అయితే అక్కడ ఆమెపై జరిగిన లైంగిక వేధింపులను భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. దీన్ని తీవ్రంగా తీసుకున్న నేవీ ఆమెను విధుల్లోంచి తొలగించింది. ఈ క్రమంలో ఆమె జలాంతర్గామిలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. విధుల సమయంలో కొంతమంది లైంగికంగా వేధించేవారని, నిద్రపోయే సమయంలో శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవారని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే !! హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజనం

స్టేషన్‌లో విరిగిన ట్యాప్‌.. తడిసిన రైలు ప్రయాణికులు..

దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!

టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు

 

Published on: Nov 04, 2022 08:46 AM
Loading...
Unable to load recommendations.
Follow Us