Helmet: మరీ ఇంత అమాయకత్వమా.. పోలీసులకు భయపడి అతను ఏం చేసాడో చూడండి..! ట్రెండ్ అవుతున్న వీడియో..

Updated on: Oct 17, 2022 | 10:00 AM

ఈ వీడియో ఓ తోపుడుబండి పై కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి సంబంధించినది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిరువ్యాపారి చేసిన పనికి ముచ్చటపడుతున్నారు.


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకోడానికి వెళ్తున్నాడు ఓ వ్యక్తి. అయితే అతను తన తలకు హెల్మెట్‌ ధరించి ఉన్నాడు. అది గమనించిన భగవత్‌ ప్రసాద్‌ అనే పోలీసు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి హెల్మెట్‌ ఎందుకు పెట్టుకున్నావని అడిగారు. అతను వెంటనే.. హెల్మెట్ లేని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తారు కదా సర్‌ అంటూ సమాధానం చెప్పాడు. అతడి అమాయకత్వానికి చలించిపోయారు ఆ పోలీసు. దాంతో.. తోపుడు బండి వాళ్లు హెల్మెట్ పెట్టుకోనవసరం లేదంటూ అతనికి వివరించారు. అలాగే ట్రాఫిక్‌కు అడ్డురాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘భయం కాదు.. అవగాహన కావాలి’’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. లక్షలమంది వీడియోను వీక్షించారు. ఆ తోపుడుబండి వ్యాపారి అమాయకత్వం నెటిజన్లను కూడా కదిలించింది. అంతేకాదు, పాండే వ్యవహరించిన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అధికారులు, పౌరుల మధ్య సంభాషణలు ఇలా స్నేహ పూర్వకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఖాకీలను చూస్తే ప్రజలకు భయానికి బదులు భరోసా కలగాలని కామెంట్స్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.