Lawrence Bishnoi: జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

|

Oct 25, 2024 | 8:31 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశంలో మార్మోగుతోంది. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నా అతడి సోదరుడు ఇంకా అనుచరుడు.. కెనడా నుంచి వారి గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు. అయితే లారెన్స్‌ బిష్ణోయ్‌ గురించి అతడి కజిన్‌ రమేష్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టాడు.

పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని తానెప్పుడూ ఊహించలేదని ఆయన తెలిపాడు. జైల్లో ఉన్నప్పటికీ అతడి అవసరాల కోసం బిష్ణోయ్‌ కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా రమేష్ బిష్ణోయ్ తెలిపాడు. ముందు నుంచి తమది సంపన్న కుటుంబమేననీ లారెన్స్ తండ్రి హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవారనీ వారికి తమ గ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉందనీ అన్నాడు. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడన్నారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామంలో జన్మించిన లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్న సమయంలో అతడి పేరును లారెన్స్‌ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. అతడు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టాడు. డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. దీంతో అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు. 2018లో తన అనుచరుడు సంపత్‌ నెహ్రాతో కలిసి సినీ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయిలో వార్తలకెక్కాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.