Elephant funny Video: హోటల్‌లో మహిళను నిద్రలేపి గుడ్‌మార్నింగ్‌ చెప్పిన ఏనుగు.. క్యూట్‌ వీడియో

|

Aug 04, 2022 | 9:26 AM

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ ఏనుగు, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.


సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ ఏనుగు, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. సాధారణంగా ఉదయాన్నే నిద్ర లేవాలంటే కాస్త బద్దకంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేవాలనుకున్నవాళ్లు అలారం పెట్టుకుని పడుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళను ఉదయాన్నే ఓ ఏనుగు వచ్చి నిద్రలేపుతోంది. థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌ గదిలో ఓ మహిళ మంచంపై హాయిగా నిద్రపోతుంది. ఇక ఆ మహిళ తనను ఉదయాన్నే నిద్ర లేపమని ఆ ఏనుగుకు చెప్పిందో ఏమో.. తెల్లవారుజామూనే ఆ ఏనుగు వచ్చి మహిళ నిద్రపోతున్న మహిళ రూమ్‌ కిటికీలోంచి తన తొండంతో మహిళను తట్టి లేపుతుంది. దాంతో ఒక్కసారిగా మహిళ లేచి ఏనుగును చూసి ఆశ్చర్యపోయింది. ఈ వీడియోను సాక్షి జైన్‌ అనే ప్రముఖ లైఫ్‌ స్టైల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా 70 మిలియన్లమంది చూసారు.. అంతేకాదు లక్షలమంది లైక్‌చేస్తూ.. వేలల్లో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on