Old Dead body: 38 ఏళ్లు గడిచినా చెక్కుచెదరని మృతదేహం..! చూసేందుకు క్యూ కట్టేస్తున్నా నెటిజన్లు..
ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఒక రోజు గడిస్తే మృతదేహం దుర్వాసన రావడం సర్వసాధారణం. కానీ.. దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి.
ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఒక రోజు గడిస్తే మృతదేహం దుర్వాసన రావడం సర్వసాధారణం. కానీ.. దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. అయినా ఆ మృతదేహాలు చెక్కుచెదరకుండా ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే మంచుకొండల్లో ఉండటం వలన ఆ మృతదేహాలు కుళ్లిపోకుండా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. పాకిస్తాన్ తో యుద్ధం సందర్భంగా 1984లో భారత ఆర్మీ ఆపరేషన్ మేఘ్ దూత్ ను చేపట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కేంద్రంగా పేరొందిన సియాచిన్ కు 19 కుమావన్ రెజిమెంట్ కు చెందిన 20 మంది సైనికుల బృందం చేరుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న మంచు తుపానుకు అక్కడున్న వారంతా కొట్టుకుపోయారు. వీరిలో 15 మంది మృతదేహాలు లభ్యం కాగా.. ఐదుగురి ఆచూకీ తెలియలేదు. తాజాగా సియాచిన్ లోని మంచుకొండల్లోని ఓ పాత బంకర్ లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరిని ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో ద్వారాహత్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా గుర్తించారు. మరొకరి మృతదేహన్ని గుర్తించే పనిలోపడ్డారు అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..