మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..

|

Sep 01, 2022 | 9:07 AM

మొసళ్లతో నిండిన నదిలో ఒక బాలుడు పడిపోయాడు. ఓ పక్కన మునిగిపోతాననే భయం.. మరో పక్క మొసళ్లు తినేస్తాయన్న భయం.. క్షణక్షణం నరకయాతనతో ప్రాణాలకోసం పోరాడాడు ఆ బాలుడు.

మొసళ్లతో నిండిన నదిలో ఒక బాలుడు పడిపోయాడు. ఓ పక్కన మునిగిపోతాననే భయం.. మరో పక్క మొసళ్లు తినేస్తాయన్న భయం.. క్షణక్షణం నరకయాతనతో ప్రాణాలకోసం పోరాడాడు ఆ బాలుడు. అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఒక పిల్లవాడు నదిలో పడిపోయాడు. నీళ్లలో మునిగిపోతూ, ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అయితే ఏదో ఒకవిధంగా తనను తాను కాపాడుకోవాలనే ఆరాటంతో… భారీగా ప్రవహించే నదిలో సాయశక్తులా ఈత కొడుతూ ఉన్నాడు. ఇంతలో అతని చుట్టూ మొసళ్ళు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ బాలుడు భయపడుతూనే మొసళ్లనుంచి తప్పించుకుంటూ ఈత కొడుతున్నాడు. ఇంతలో దూరంగా రెస్క్యూ టీం కనిపించింది. మునిగిపోతున్న బాలుడిని చూసి వెంటనే బాలుడివద్దకు చేరుకుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం బాలుడిని మొసళ్ల బారిన పడకుండా మెరుపు వేగంతో పడవలోకి లాగేశారు. దాంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు..సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చంబల్ నదికి చెందినదిగా ఉంది కానీ, ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు నెటిజన్లు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. రెస్క్యూ టీమ్ బాలుడిని రక్షించడానికి సకాలంలో చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. “ఇది నిజమైన వీరోచిత పోరాటం.. రెస్క్యూ టీమ్‌కి సెల్యూట్‌ అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!

Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్

వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్‌

Published on: Sep 01, 2022 09:07 AM