PM Modi Favorite Dish: ప్రధాని మోడీకి ఇష్టమైన వంట చేసిపెట్టిన ఆస్ట్రేలియా పీఎం..

|

Apr 20, 2022 | 8:39 AM

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇష్టమైన వంటకాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వండి.. భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. భారతదేశంతో ఆస్ట్రేలియా (India-Australia) కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో..


ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇష్టమైన వంటకాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వండి.. భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. భారతదేశంతో ఆస్ట్రేలియా (India-Australia) కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో స్కాట్ మారిసన్ ఇలా సెలెబ్రెట్ చేసుకున్నారు. ఈ మేరకు శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడిని తయారు చేసిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భారత్‌తో తమ కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో.. రాత్రి వేళ వంటల తయారీ కోసం ఎంచుకున్న ఆహారం ప్రియమైన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ప్రాంతానికి చెందినవి అని మోరిసన్ తెలిపారు. అందులో ప్రధాని మోడీకి ఇష్టమైన కిచిడి ఉందంటూ మోరిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఈ మేరకు ఆయన వంటగదిలో ఉన్న ఫొటోను షేర్ చేసి.. అందరినీ ఆశ్యర్యపరిచారు.భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై పీయూష్‌ గోయల్‌, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి డాన్‌ టెహన్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, స్కాట్‌ మారిసన్‌ భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోదీ తనకిష్టమైన ఖిచిడి గురించి పలు ఇంటర్వ్యూలల్లో స్వయంగా చెప్పారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..