100-day Cough: కలవరపెడుతున్న వందరోజుల దగ్గు.! అతి వేగంగా వ్యాప్తి.. అధికారులు వార్నింగ్‌.

|

Dec 13, 2023 | 4:49 PM

యూకేను మరో మహమ్మారి కలవరపెడుతోంది. యూకేలో వంద రోజుల దగ్గు (100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దగ్గు కారణంగా దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతటా వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం..

యూకేను మరో మహమ్మారి కలవరపెడుతోంది. యూకేలో వంద రోజుల దగ్గు (100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దగ్గు కారణంగా దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతటా వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్‌ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు.

ఈ 100 రోజుల దగ్గు… కోరింత దగ్గు రకానికి చెందిన సుదీర్ఘ దగ్గే అని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. నిపుణుల ప్రకారం… బోర్టెటెల్లా పెర్టుస్సిస్‌ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల వాయుమార్గాల ఇన్ఫెక్షన్‌ అయ్యి అదేపనిగా దగ్గు వస్తుంది. ఈ వ్యాధిలో జలుబు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తీవ్రమైన దగ్గుతో ఒక్కోసారి వాంతులు చేసుకోవడం, పక్కటెముకలు విరగడం, గొంతునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. శిశువుల్లో, వృద్ధుల్లో వచ్చే ఈ కోరింత దగ్గుని టీకా ద్వారా తగ్గించే అవకాశం ఉంది. దీనికి అందుబాటులో టీకా కూడా ఉందని NHS పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on