వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!

|

Dec 20, 2022 | 8:45 PM

ఆలయ సందర్శనకు వచ్చిన సీఎం భార్యను వర్షంలో తడవకుండా చూసేందుకు ఆలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవుడి విగ్రహానికి పట్టాల్సిన ముత్యాల గొడుగును సీఎం భార్యకు పట్టారు.

ఆలయ సందర్శనకు వచ్చిన సీఎం భార్యను వర్షంలో తడవకుండా చూసేందుకు ఆలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవుడి విగ్రహానికి పట్టాల్సిన ముత్యాల గొడుగును సీఎం భార్యకు పట్టారు. వర్షంలో దేవుడిని నల్లటి గొడుగు కిందే ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువత్తిర్ త్యాగరాజ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా ఆలయాన్ని సందర్శించినప్పుడు వర్షం కురిసింది. అప్పుడు కొంతమంది సిబ్బంది దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును సీఎం స్టాలిన్‌ భార్య దుర్గకు పట్టి గుడి బయటికి తీసుకెళ్లారు. ఉత్సవాల్లో దేవుడి ఊరేగింపు జరుగుతుండగా, వానలో తడవకుండా దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును ముఖ్యమంత్రి సతీమణి కోసం ఉపయోగించారు. బదులుగా దేవుడు తడవకుండా ఉండటానికి నల్ల గొడుగును వాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెలూన్‌ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!

అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??

పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజ‌న్లు ఫిదా !!

విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!

మరో మట్టిలో మాణిక్యం.. ల‌తాజీ పాట‌ను హృద్యంగా ఆల‌పిస్తూ..

 

Published on: Dec 20, 2022 08:45 PM