ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా

Updated on: Dec 08, 2025 | 3:06 PM

పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద ప్రధాన అజెండాగా మారింది. తెలంగాణలోని సర్పంచ్ అభ్యర్థులు కొండెంగలు, కుటుంబ నియంత్రణ, సొంత ఖర్చులతో బోన్లలో బంధించడం వంటి వినూత్న పరిష్కారాలను హామీ ఇస్తున్నారు. ఓటర్లు కోతుల నివారణకు ప్రాధాన్యతనిస్తూ, దీనిని నెరవేర్చిన వారికే తమ ఓటు అని చెబుతున్నారు. అభ్యర్థులు ఒక్కో కోతికి వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.

నాకు అవకాశం కల్పిస్తే కోతుల బెడదను నివారిస్తా.. కోతులను తరిమికొట్టేందుకు వాడకో కొండెంగను తెచ్చిపెడతా.. రాత్రిపగలు అన్న తేడాలేకుండా కోతులను కొట్టేందుకు పంచాయతీ నుంచి కొందరిని రక్షణగా పెడతా.. కోతులకు పునరుత్పత్తి జరకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిస్తా.. కోతుల నివారణ కోసం సొంత డబ్బులు ఖర్చుచేస్తా.. ఇవీ పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు ఇచ్చిన హామీలు. పంచాయతీయ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోతలు బెడద ఓ సవాల్‌గా మారింది. ఎన్నికల ప్రచార హామీల్లో ఇదే అంశం ఇప్పుడు ప్రధాన అజెండాగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలు, ఊళ్లు అనే తేడా లేకుండా ఈసారి ప్రచారంలో ఇలా వానరసేనతో అభ్యర్థులు యుద్ధానికే సిద్ధమయ్యారు. కోతుల నివారణే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల కంటే కోతుల బెడద నివారణే ప్రధాన ఎజెండాగా మారింది. ముఖ్యంగా జనగాం జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థులు తమ స్వంత ఖర్చులతో కోతుల నివారణ చేపట్టారు. బోన్లలో బంధించి అడవిలో విడిచిపెట్టే కార్యక్రమం చేపట్టారు. ఓటు అడిగే అభ్యర్థులకు ఓటర్లు కూడా ముందు ఇదే అడుగుతున్నారు. కోతులు లేకుండా చేసిన అభ్యర్థికే మా ఓటు అని ఓటర్లు చెబుతుండటంతో ఒక్కో కోతికి వెయ్యి నుంచి రెండు వేలు పెట్టి మరీ అడవిబాటన పట్టిస్తున్నారు. సర్పంచ్‌ ఎన్నికలేమోగాని కోతులకు పెట్టే ఖర్చే తడిసి మోపెడవుతుందని అభ్యర్థులు లబోదిబోమంటున్న వాతావరణం కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు

దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్

పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం

మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..