పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా
టెల్ అవీవ్ ఆకాశంలో వేల కాకుల గుంపు ప్రజలను భయపెట్టింది, అణు యుద్ధానికి సంకేతమా అనే అనుమానాలు రేగాయి. కాకులు గుంపుగా కనబడితే అశుభం అని నమ్మకాలున్నాయి. అయితే, పక్షి శాస్త్రవేత్తలు దీనిని 'ముర్మురేషన్' అని, ఆహారం కోసం లేదా భద్రత కోసం వలస పక్షులు ఇలా ప్రయాణిస్తాయని వివరించారు. మూఢనమ్మకాలు కాకుండా, ప్రకృతి మార్పులను అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే నగరం. కానీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూసారు. పగలు కాస్తా రాత్రిలా మారింది. సూర్యుడిని కమ్మేసినవి మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా ఉందని జనం వణికిపోయారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? అది రాబోయే అణు యుద్ధానికి సంకేతమా? మనం చిన్నప్పుడు వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్ లో కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో కాకులు చేసిన హడావిడి చూసి, స్థానికులు ‘చెడు శకునం అని నమ్మారు. గతంలో పక్షుల ప్రవర్తన వింతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా జనం చూడ లేదు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.. ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా అణుయుద్ధం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, దీనిని ‘ముర్మురేషన్’ (Murmuration) అంటారు. ఆహారం కోసం లేదా సురక్షిత స్థావరం కోసం వెతుక్కుంటూ పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలా విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల అది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైనవనీ అవి వేటాడే పక్షుల నుంచి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయనీ అంటున్నారు. ఒకవైపు మూఢనమ్మకం, మరోవైపు శాస్త్రీయ కోణం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్‌లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని కొంతవరకు సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసర భయాలకు పోకుండా సంయమనం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్
జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’
ఫ్యాన్స్ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్