లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
భద్రాచలం ఏజెన్సీ రైతులు తమ విలువైన మిర్చి పంటను దొంగల బారి నుండి కాపాడుకోవడానికి హైటెక్ నిఘాను ఆశ్రయించారు. గోదావరి ఇసుక కల్లాల్లో లక్షల పెట్టుబడితో పండించిన మిర్చిని రక్షించుకోవడానికి సోలార్ సీసీ కెమెరాలు, సైరన్‌లు ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల నిఘాతో పాటు, అపరిచితులు రాగానే సైరన్ మోగుతుంది. మొబైల్ ద్వారా పంటను పర్యవేక్షిస్తూ, రైతులు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. సాంకేతికతతో వారి శ్రమకు భద్రత లభించింది.
ఒకప్పుడు పల్లెల్లో అపరిచితులు అడుగుపెడితే గ్రామ సింహాల అరుపులు వినిపించేవి. కానీ ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గోదావరి తీరానికి వెళ్తే సీన్ వేరేలా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో అడుగు పెట్టగానే ‘కుయ్ కుయ్’ మంటూ సైరన్ మోగుతోంది. దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అవును.. తాము ప్రాణం కంటే మిన్నగా పండించిన మిర్చి పంటను కాపాడుకోవడానికి ఏజెన్సీ రైతులు ఇప్పుడు హైటెక్ నిఘాను ఆశ్రయించారు. లంక భూముల్లో పండే నాణ్యమైన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట, కల్లాల్లో ఆరబోసినప్పుడు దొంగల పాలవ్వకుండా కాపాడుకోడానికి రైతులంతా కలిపి నడుం బిగించారు. పొలాల్లోనూ, గోదావరి ఇసుక కల్లాల్లోనూ ఎటు చూసినా ఎత్తైన టవర్లను తలపించేలా సోలార్ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కెమెరాలు 360 డిగ్రీలు చుట్టూ తిరుగుతూ ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి కల్లంలోకి అడుగుపెడితే చాలు, వెంటనే పెద్ద శబ్దంతో సైరన్ మోగి చుట్టుపక్కల వారిని అలర్ట్ చేస్తుంది. రైతులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఎక్కడ ఉన్నా కల్లంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. కూలీల పనితీరును పర్యవేక్షించడం కూడా ఇప్పుడు వారికి సులభతరమైంది. ఒకప్పుడు దొంగల భయంతో రాత్రంతా కళ్లల్లో వత్తులు వేసుకుని కాపలా కాసే రైతులు, ఇప్పుడు ఈ ‘నిఘా నేత్రాల’ అండతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. సాంకేతికత తోడైతే రైతు కష్టానికి భద్రత ఉంటుందని నిరూపిస్తున్నారు ఏజెన్సీ రైతన్నలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే !!
ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ హీరోయిన్
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలకు రెక్కలు
ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి